IPL retention : ఇంకొన్ని గంటల్లో ఐపీఎల్ 2027 రిటెన్షన్ లిస్ట్- చూపంతా ధోనీ పైనే! రిటైర్ అవుతాడా? ఆడతాడా?
భారతదేశం, నవంబర్ 17 -- ఐపీఎల్ 2027 సీజన్ సమరానికి నేటితో (నవంబర్ 17) అధికారికంగా కౌంట్‌డౌన్ మొదలవుతోంది! అన్ని ఫ్రాంచైజీలు తాము రీటైన్, రిలీజ్ చేసే ఆటగాళ్ల జాబితాలను ఇవాళ ప్రకటించనున్నాయి. అయితే గత కొన్ని సీజన్లుగా క్రికెట్ అభిమానులను వేధిస్తున్న ఒకే ఒక ప్రశ్న మళ్లీ తెరపైకి వచ్చింది: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తరఫున మహేంద్ర సింగ్ ధోనీ మరో సీజన్ ఆడతారా లేదా?
రిటెన్షన్ గడువు రోజే ఈ సీఎస్కే దిగ్గజం ఆటకు వీడ్కోలు పలుకుతారంటూ తాజాగా మొదలైన ప్రచారం ఈ చర్చకు కొత్త ఊపిరి పోసింది. ఇప్పటివరకు అటు ఫ్రాంచైజీ గానీ, ఇటు ధోనీ గానీ ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ, ధోనీ జట్టులో లేకపోతే రాబోయే సీజన్ కోసం చెన్నై యాజమాన్యం వేసే ప్రణాళికలు, ఆటగాళ్ల రిటెన్షన్ నిర్ణయాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది.
గత కొంతకాలంగా చెన్నై యాజమాన్యంలో ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.