భారతదేశం, మార్చి 28 -- ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్ ఐపీఎల్ కొత్త సీజన్ వస్తుందంటే హుషారు మామూలుగా ఉండదు. ఓపెనింగ్ సెర్మనీలో ఏ సెలబ్రిటీ డ్యాన్స్ చేస్తారోనని ఫ్యాన్స్ వెయిట్ చేస్తారు. కానీ ఐపీఎల్ 2026లో మాత్రం పరిస్థితి డిఫరెంట్ గా ఉండబోతుంది. ఈ సారి ఓపెనింగ్ సెర్మనీ లేకపోవడమే అందుకు కారణం.

ఐపీఎల్ 2026 నేడే (మార్చి 28) ప్రారంభం కానుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య తొలి పోరు జరగనుంది. అయితే, ప్రతి ఏటా అట్టహాసంగా జరిగే ఓపెనింగ్ సెర్మనీని ఈసారి బీసీసీఐ రద్దు చేసింది. దీని వెనుక ఒక విషాదకరమైన కారణం ఉంది.

2025లో ఆర్సీబీ ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ లీగ్ చరిత్రలోనే ఆర్సీబీ గెలిచిన ఫస్ట్ టైటిల్ ఇదే. ఈ నేపథ్యంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సంబరాలు నిర్వహ...