భారతదేశం, ఏప్రిల్ 25 -- IPL 2026 Delhi Capitals vs Punjab Kings : ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో పరుగుల వరద పారుతోంది. మైదానంలోకి దిగితే చాలు సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపిస్తూ బ్యాటర్లు రికార్డులను తిరగరాస్తున్నారు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు.. పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి ఏకంగా 264 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఈ సీజన్లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ నిలిచింది.
ఢిల్లీ బ్యాటర్ల ధాటికి పంజాబ్ బౌలర్లు చేతులెత్తేశారు. కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంగ్త్ తో బౌలింగ్ చేయడంలో విఫలమవడమే కాకుండా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఇన్నింగ్స్ చివరి వరకు ఏ దశలోనూ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.