భారతదేశం, మే 4 -- IPL 2026 Gujarat Titans vs Punjab Kings : ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠ పోరులో గుజరాత్ టైటాన్స్ (GT) విజయం సాధించింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ మధ్య సాగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ (PBKS)పై గుజరాత్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.

జేసన్ హోల్డర్ తన స్పెల్‌తో పంజాబ్ బ్యాటర్లను వణికించగా. ఛేదనలో సాయి సుదర్శన్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు వాషింగ్టన్ సుందర్ 'ఫినిషింగ్ టచ్' గుజరాత్‌కు అద్భుత విజయాన్ని అందించాయి. ఈ గెలుపుతో గుజరాత్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి చేరుకోగా.. పంజాబ్ కింగ్స్ ఓడినా అగ్రస్థానంలోనే కొనసాగుతోంది.

టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ తొలి ఓవర్లోనే పంజాబ్‌కు షాకిచ్చాడు. మొదటి ఓవర్ రెండో బంతికే ప...