భారతదేశం, ఏప్రిల్ 7 -- దేశంలో ఐపీఎల్ ఫీవర్ మామూలుగా లేదు. ఇలాంటి సమయంలో చాలా మంది మోసం చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఎవరు గెలుస్తారు? ఏ టీమ్ మీద బెట్టింగ్ పెట్టాలని కొందరు మీ దగ్గరకు రావొచ్చు. అలాంటి ప్రకటనలపై జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు.

ఐపీఎల్ క్రికెట్ ఫీవర్‌ను ఆసరాగా చేసుకుని సోషల్ మీడియాలో కొందరు మోసపూరిత ప్రకటనలతో విరుచుకుపడుతున్నారని సజ్జనార్ చెప్పారు. కేవలం డబ్బు కోసం కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు అసత్య ప్రచారాలు చేస్తూ సామాన్యులను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.

'టాస్ ఎవరిది!? మ్యాచ్ ఏ టీమ్ గెలుస్తుంది!? అని ముందే చెబుతామంటూ మిమ్మల్ని తమ ఛానెల్స్‌లో సబ్‌స్క్రైబ్ చేయించుకుని, నిలువునా ముంచే బెట్టింగ్ ఊబిలోకి లాగుతున్నారు. ఇలాంటి ఫేక్ ప్రిడిక్షన్ ఛానెళ్ల మాటలు నమ్మి మీ కష్టార్జితాన్ని పోగొట్టుకోవద్దు.' అని సజ...