భారతదేశం, మార్చి 31 -- గౌహతిలోని బార్‌సపారా స్టేడియం సోమవారం (మార్చి 30) రాత్రి ఒక అద్భుతమైన ఇన్నింగ్స్‌కు సాక్ష్యంగా నిలిచింది. ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ (RR), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య జరిగిన మ్యాచ్‌లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్‌తో ప్రకంపనలు సృష్టించాడు. చెన్నై బౌలర్లను ఉతికేస్తూ, కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ఐపీఎల్ 2025 సీజన్ లో వైభవ్ సూర్యవంశీ అనే పేరు ప్రపంచానికి తెలిసింది. ఈ చిన్నోడు చెలరేగిపోయాడు. ఇప్పుడు ఐపీఎల్ 2026లోనూ అదే దూకుడు కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ మ్యాచ్ లోనే క్రీజులోకి వచ్చినప్పటి నుంచి వైభవ్ దంచుడు మొదలెట్టాడు. రికార్డులు బ్రేక్ చేశాడు.

ఐపీఎల్ 2026లో తన ఫస్ట్ మ్యాచ్ లోనే వైభవ్ సూర్యవంశీ రికార్డుల మోత మోగించాడు. క...