భారతదేశం, ఏప్రిల్ 1 -- ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలోనే పంజాబ్ కింగ్స్ (PBKS) టీమ్ కు ఓ కొత్త స్టార్ దొరికాడు. 22 ఏళ్ల ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కూపర్ కనోలీ గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అదరగొట్టాడు. కేవలం 44 బంతుల్లోనే 72 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి, జట్టుకు 3 వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు. ఈ యువ క్రికెటర్ ఐపీఎల్ అరంగేట్రంలోనే 163.64 స్ట్రైక్ రేట్‌తో ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లతో చెలరేగిపోయాడు.

కూపర్ కనోలీ లెఫ్టార్మ్ బ్యాటర్. అలాగే స్పిన్ ఆల్ రౌండర్. ఆస్ట్రేలియా తరపున ఇప్పటికే ఇంటర్నేషనల్ డెబ్యూ చేశాడు. అక్కడ బిగ్ బాష్ లీగ్, డొమెస్టిక్ క్రికెట్లోనూ అదరగొట్టాడు. అతణ్ని రూ.3 కోట్లకు పంజాబ్ కింగ్స్ వేలంలో దక్కించుకుంది. బ్యాటింగ్ ఆర్డర్లో మూడో స్థానంలో వెళ్లిన కనోలీ గుజరాత్ బౌలింగ్ ను ఆటాడుకున్నాడు.

వెన్ను నొప్పి నుంచి ఇటీవల కోలుకున్న ...