భారతదేశం, మే 15 -- IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ పరిస్థితి చూస్తుంటే 'మొదటి సగం అద్భుతం.. రెండో సగం అగాధం' అన్నట్లుగా ఉంది. సీజన్ తొలి అర్ధభాగంలో ఆరు విజయాలతో అజేయంగా దూసుకుపోయిన పంజాబ్, ఒక్కసారిగా కుప్పకూలింది. వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓటమి పాలవ్వడంతో ఆ జట్టు ప్లేఆఫ్ అవకాశాలు ఇప్పుడు సంక్లిష్టంగా మారాయి. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింటా, కోచ్ రికీ పాంటింగ్ వీడియో వైరల్ గా మారింది.

సాధారణంగా ఏదైనా జట్టు వరుసగా ఇన్ని మ్యాచ్‌లు ఓడిపోయినప్పుడు మైదానంలో ఉండే ఆటగాళ్ల కంటే, వెనుక ఉండి వ్యూహాలు రచించే కోచ్‌లు, మేనేజ్‌మెంట్‌పైనే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ధర్మశాలలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఐదో ఓటమిని చవిచూసిన తర్వాత ఇలాంటి దృశ్యాలు కనిపించాయి. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మైదానంలో విఫలమవగా, డగౌట్‌లో టీమ్ ఓనర...