భారతదేశం, ఫిబ్రవరి 27 -- ఐపీఎల్ లవర్స్ కు కీలక అప్‌డేట్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 19వ సీజన్ ప్రారంభ తేదీలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. తాజా సమాచారం ప్రకారం 2026 ఐపీఎల్ ఎడిషన్ మార్చి 28న ప్రారంభమై, మే 31న ముగియనుంది. గతేడాది డిసెంబర్‌లో జరిగిన వేలం తర్వాత.. టోర్నీ మార్చి 26నే మొదలవుతుందని భావించినప్పటికీ, అంతర్గత కారణాల వల్ల దీనిని రెండు రోజులు ముందుకు జరిపినట్లు తెలుస్తోంది.

ఐపీఎల్ 2026 పూర్తి స్థాయి షెడ్యూల్ విడుదల కావడానికి మరికొంత సమయం పట్టేలా ఉంది. దీనికి ప్రధాన కారణం మూడు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు. అస్సాం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ఇంకా తేదీలను ప్రకటించలేదు.

గతంలో 2009, 2014, 2019, 2024లలో కూడా ఎన్నికల వల్ల షెడ్యూల్‌ను రెండు విడతల్లో ప్రకటి...