భారతదేశం, జూన్ 21 -- ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది టెక్ ప్రియులు.. యాపిల్ తన సరికొత్త ఐఫోన్‌ను ఎప్పుడు లాంచ్ చేస్తుందా అని ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఈ ఏడాది కూడా అందుకు మినహాయింపు ఏమీ కాదు! గత ఏడాది సెప్టెంబర్‌లో మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్ 17 సిరీస్‌కు కస్టమర్ల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు యాపిల్ తన తదుపరి తరం ఐఫోన్లతో మరింతగా అలరించడానికి సన్నద్ధమవుతోంది. కాలిఫోర్నియాకు చెందిన ఈ టెక్ దిగ్గజం ఇంకొన్ని నెలల్లో ఐఫోన్ 18 ప్రో మోడళ్లను మార్కెట్లోకి తీసుకురాబోతోంది. బేస్ మోడల్ ఐఫోన్ 18 తర్వాత వస్తున్నప్పటికీ, ప్రో మోడల్స్ మాత్రం అదిరిపోయే అప్‌గ్రేడ్లతో ముందుగానే రానున్నాయి.

మీరు గనుక ప్రస్తుతం కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే.. కొద్ది నెలలు ఆగి ఐఫోన్ 18 ప్రో కోసం వేచి చూడటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ...