భారతదేశం, జూలై 23 -- భారత్‌లో తన హార్డ్‌వేర్ ఉత్పత్తులైన ఐప్యాడ్‌లు, మ్యాక్‌బుక్‌లు, యాపిల్ టీవీ, హోమ్‌పాడ్‌ల ధరలను టెక్ దిగ్గజం 'యాపిల్' భారీగా పెంచిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఐఫోన్లను మినహాయించినప్పటికీ, ఇప్పుడు ఐఫోన్ ప్రేమికులకు చేదు వార్త అందే సూచనలు కనిపిస్తున్నాయి! భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన 'ఐఫోన్ 17 సిరీస్' మోడళ్ల ధరలను పెంచేందుకు యాపిల్ సన్నాహాలు చేస్తోందని వార్తలు వస్తున్నాయి.

ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా పంచుకున్న సమాచారం ప్రకారం.. యాపిల్ ఆథరైజ్డ్ ఆఫ్‌లైన్ రిటైలర్ 'ఐప్లానెట్' డీలర్లకు ధరల పెంపునకు సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే అందించింది.

ప్రస్తుతం బయటకు వచ్చిన సమాచారం ప్రకారం.. ప్రాథమిక ఐఫోన్ 17 మోడల్ ధర అత్యధికంగా రూ.12,000 వరకు పెరిగే అవకాశం ఉంది.

ఐఫోన్ 17 (256జీబీ బేస్ వేరియంట్): సె...