భారతదేశం, మే 16 -- కొంత డబ్బు చేతికి రాగానే చాలా మందికి వచ్చే మొదటి ఆలోచన.. దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? అని! ముఖ్యంగా ఈ రోజుల్లో 'మ్యూచువల్ ఫండ్ ఎస్‌ఐపీ' లో డబ్బులు పెట్టాలా? లేక ఎప్పటికీ నమ్మకమైన 'బంగారం' పై ఇన్వెస్ట్ చేయాలా? అనే గందరగోళం ఎక్కువ మందిలో కనిపిస్తుంటుంది. ఈ రెండూ కూడా మీ డబ్బును పెంచడానికి ఉపయోగపడేవే అయినప్పటికీ.. మీ దగ్గర ఎంత బడ్జెట్ ఉంది? మీరు ఎంతవరకు రిస్క్ తీసుకోగలరు? అనే అంశాలపై మీ ఎంపిక ఆధారపడి ఉంటుంది.

ముందుగా ఎస్‌ఐపీ (సిస్టెమాటిక్ ఇన్వెస్ట్​మెంట్​ ప్లాన్- సిప్) విషయానికి వస్తే.. ఇందులో మీ బడ్జెట్‌ను బట్టి ప్రతి నెలా రూ. 500 లేదా అంతకన్నా ఎక్కువ అమౌంట్​ని ఒక స్థిరమైన మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ డబ్బును ప్రధానంగా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా స్టాక్ మార్కెట్​లో పెట్టుబడి పెడతారు. అందుకే దీర్ఘకాలంలో ఇందులో ఎక్కువ రి...