భారతదేశం, సెప్టెంబర్ 28 -- Intimate Scenes: సినిమాలు, ఓటీటీ వెబ్ సిరీస్‌లలో బోల్డ్, ఇంటిమేట్ సీన్స్ చేయడం నటీనటులకు ఎప్పుడూ ఒక పెద్ద ఛాలెంజే. షూటింగ్ సమయంతో పాటు ఆ సీన్స్ బయటకు వచ్చాక సోషల్ మీడియాలో ఎలా వైరల్ అవుతాయో అనే భయం ప్రతీ నటుడిలోనూ ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్ పాపులర్ ఫ్రాంచైజ్ 'లస్ట్ స్టోరీస్ 3' లో నటించిన విజయ్ వర్మ, రాధికా మదన్ ఈ సున్నితమైన అంశంపై ఓపెన్‌గా మాట్లాడారు.

బోల్డ్ సీన్స్ లీక్ అవ్వడం, నెట్‌లో వైరల్ కావడంపై తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించారు. నటులుగా పని చేసేటప్పుడు ప్రేక్షకుల చూపును పట్టించుకోకుండా తమ పనిపైనే దృష్టి పెట్టాలని చెప్పారు.

'లస్ట్ స్టోరీస్ 3' లో అలీ ఫజల్‌తో కలిసి బోల్డ్ సీన్స్‌లో నటించిన రాధికా మదన్ రీసెంట్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇలాంటి క్లిప్‌లు లీక్ కావడం అనేది నటుల చేతుల్...