భారతదేశం, నవంబర్ 20 -- సోషల్ మీడియా ప్రియులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఒక కీలక మార్పును ఇన్‌స్టాగ్రామ్ ఎట్టకేలకు అందుబాటులోకి తెచ్చింది! 24 గంటల తర్వాత అదృశ్యమయ్యే ఫొటోలు, వీడియోల కోసం ఇన్‌స్టాగ్రామ్​లో 2016లోనే 'స్టోరీస్' ఫీచర్‌ను ప్రవేశపెట్టిన మెటా ఆధారిత సంస్థ,. సరిగ్గా దశాబ్ద కాలం తర్వాత, ఇప్పుడు ఆ స్టోరీలను ఎడిట్ చేసే వెసులుబాటును కల్పించింది. స్టోరీ షేర్ చేసిన తర్వాత చిన్న అక్షర దోషం కనిపించినా, పాట మార్చాలనిపించినా ఇకపై దాన్ని డిలీట్ చేసి మళ్లీ అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. అప్పటివరకు వచ్చిన వ్యూస్, లైక్స్, రిప్లైలకు ఎలాంటి నష్టం కలగకుండానే 15 నిమిషాల లోపు స్టోరీని ఎడిట్ చేసుకునే సరికొత్త ఫీచర్‌ను ఇన్‌స్టాగ్రామ్ తీసుకొచ్చింది.

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లోనే కాకుండా నేడు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఊరిలో ఇన్‌స్ట...