భారతదేశం, జూన్ 19 -- భారతీయ స్టాక్ మార్కెట్లో ఐటీ రంగానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేశీయ ఐటీ కంపెనీల షేర్లు భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అంతర్జాతీయ టెక్నాలజీ సేవల దిగ్గజం యాక్సెంచర్ తన పూర్తి సంవత్సర ఆదాయ వృద్ధి అంచనాలను తగ్గించడం, అలాగే తదుపరి త్రైమాసికానికి బలహీనమైన అంచనాలను విడుదల చేయడమే ఇందుకు ప్రధాన కారణం. యాక్సెంచర్ ఇచ్చిన ఈ షాక్‌తో ఐటీ రంగంలో డిమాండ్ తగ్గుతోందనే ఆందోళనలు మళ్లీ మొదలయ్యాయి.

దీని ప్రభావంతో మార్కెట్ సూచీ నిఫ్టీ 50 1 శాతం నష్టపోతే, నిఫ్టీ ఐటీ ఇండెక్స్ దాదాపు 7 శాతం మేర కుప్పకూలింది. ఉదయం 9:50 ప్రాంతంలో కాస్త తేరుకుని 5.5శాతం నష్టాల్లో కొనసాగుతోంది.

ఇక నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌లో ఉన్న అన్ని కంపెనీల షేర్లు నష్టాల బాట పట్టాయి. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ అత్యధికంగా 8.1 శాతం నష్టపోగా, దాని వెనుకే ఎంఫాసిస్, టెక్ మహీంద్...