భారతదేశం, ఏప్రిల్ 13 -- How to become a lifestyle influencer : సోషల్​ మీడియాలో మీరు తరచూ ఇన్​ఫ్లుయెన్సర్లను చూస్తూనే ఉంటారు. లైఫ్​స్టైల్​ నుంచి వినోదం వరకు ఈ ఇన్​ఫ్లుయెన్సర్లు తమ అద్భుతమైన 'స్టోరీ టెల్లింగ్​'తో ఫాలోవర్లను కట్టిపడేస్తుంటారు. అందుకు తగ్గట్టుగానే లక్షల్లో డబ్బు సంపాదిస్తున్నారు. లగ్జరీ కార్లు కొంటున్నారు. అవి చూసి మనకి కూడా ఇన్​ఫ్లుయెన్సర్​ అవ్వాలనిపిస్తూ ఉంటుంది. మన ప్రతిభను కనబరుచుకుని, డబ్బులు సంపాదించాలని ఉంటుంది. కానీ ఎలా మొదలుపెట్టాలి? ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి? అన్న విషయాల్లో చాలా మంది వెనకడుగు వేస్తుంటారు. వీరులో మీరూ ఉన్నారా? అయితే ఇది మీకోసమే.

ఇన్​ఫ్లుయెన్సర్​ అవ్వాలంటే ముందుగా రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి.. ఎవరైనా ఇన్​ఫ్లుయెన్సర్​ అవ్వొచ్చు. రెండు.. ఇన్​ఫ్లుయెన్సర్​ అవ్వడం అంత సులభం కాదు. మీరు గమనిస్తే...