భారతదేశం, ఆగస్టు 28 -- Telangana Indiramma Housing Scheme :హైదరాబాద్ మహానగరంలో 'ఇందిరమ్మ టవర్స్' ఫ్లాట్ల కేటాయింపు ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా చేపట్టింది. అర్హతే ఏకైక ప్రామాణికంగా, రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతోందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

క్యూర్‌ (CURE) పరిధిలో తొలి విడతగా చేపడుతున్న ఇందిరమ్మ టవర్స్‌లో ఫ్లాట్ల కేటాయింపునకు సంబంధించి అర్హులైన ప్రజలు, మీడియా సమక్షంలోనే లక్కీడ్రా నిర్వహిస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియను లైవ్ ప్రసారాల ద్వారా అందరికీ అందుబాటులో ఉంచారు. నాంపల్లి, కుత్బుల్లాపూర్, సికింద్రాబాద్, రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ఫ్లాట్ల కోసం నాంపల్లిలోని వెట్ గార్డెన్స్, లక్ష్మీగూడ కేంద్రాల్లో మంత్రి పొంగులేటి స్వయంగా పాల్గొని లక్కీ...