భారతదేశం, ఆగస్టు 22 -- గ్రేటర్ పరిధిలోనూ ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పట్టాలెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ కూడా ముగిసింది. అంతేకాకుండా క్యూఆర్ (CURE) పరిధిలో నిర్మించనున్న టవర్లలోని ఫ్లాట్ల కేటాయింపు ప్రక్రియ కూడా వేగవంతమవుతోంది. ఇందులో భాగంగా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు సంబంధించిన అర్హత, అనర్హతల వివరాల తొలి జాబితాను అధికారులు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. దరఖాస్తుదారులు తమ పేరు ఈ జాబితాలో ఉందో లేదో చాలా సులభంగా పరిశీలించుకోవచ్చు.

క్యూర్ పరిధిలోని మొత్తం 7,340 ఇళ్ల కేటాయింపు కోసం 60,720 మంది నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలు ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వచ్చిన దరఖాస్తులను అధికారులు అత్యంత పారదర్శకంగా, సమగ్రంగా పరిశీలించారు. దరఖాస్తుదారులకు ఉన్న సొంత ఇల్లు, స్థలాలు, ఆస్తులు, వాహనాలు వంటి అన్ని రకాల సామాజిక, ఆ...