భారతదేశం, ఆగస్టు 9 -- హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్(CURE) పరిధిలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్‌కు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. మొత్తం 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్మిస్తున్న 7,340 ఇళ్ల కోసం ఇప్పటివరకు ఏకంగా 35,125 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

నగరంలోని వేర్వేరు నియోజకవర్గాల నుంచి అందిన దరఖాస్తుల గణాంకాలు చూస్తే.. ఖైరతాబాద్: 4,394, కుత్బుల్లాపూర్: 4,121, నాంపల్లి: 3,613, మలక్‌పేట్: 2,846, శేరిలింగంపల్లి: 2,530, అంబర్‌పేట్: 2,357, కార్వాన్: 1,574, రాజేంద్రనగర్: 1,496, సికింద్రాబాద్ కంటోన్మెంట్: 1,374, మేడ్చల్: 1,153, బహదూర్‌పురా: 1,135, సనత్‌నగర్: 1,046, మల్కాజిగిరి: 1,033, ఇబ్రహీంపట్నం: 749 దరఖాస్తులు వచ్చాయి. కుకట్‌పల్లి నుంచి 5,233 దరఖాస్తులు రాగా, మహేశ్వరం నుంచి 471 దరఖా...