భారతదేశం, మే 25 -- Indiramma Bheema Scheme Telangana : జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ కానుకగా మరో భారీ సంక్షేమ పథకాన్ని అందించేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. రాష్ట్రంలోని సుమారు 1.15 కోట్ల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఉచిత జీవిత బీమా సౌకర్యం కల్పించే 'ఇందిరమ్మ బీమా' పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదివారం ఖమ్మంలో ఈ ప్రకటన చేశారు.

కుటుంబ పెద్దను కోల్పోయిన పేద కుటుంబాలకు ఈ పథకం ఒక రక్షణ కవచంలా మారుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించారు. కులం, మతం లేదా ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ దీని ద్వారా లబ్ధి చేకూరుతుందని చెప్పారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను, విధివిధానాలను సేకరించేందుకు ప్రభుత్వ అధికారులు త్వరలోనే ప్రతి ఇంటిని సందర్శిస్తారన...