భారతదేశం, అక్టోబర్ 30 -- భారతదేశంలో సామాన్యుడి నుంచి ఉన్నతాధికారి వరకు బడ్జెట్ విమాన ప్రయాణం అనగానే మొదట గుర్తుకువచ్చే సంస్థ 'ఇండిగో'. అయితే, పండుగల వేళ సొంత ఊళ్లకు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లే విమాన ప్రయాణికులకు దిమ్మతిరిగే వార్త చెప్పింది ఈ దిగ్గజ ఎయిర్‌లైన్! రాబోయే రోజుల్లో విమాన టికెట్ల ధరల పెంపు అనివార్యమని స్పష్టం చేసింది.

మధ్యప్రాచ్యంలో రగులుతున్న తీవ్ర భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి తోడు మన దేశంలో విమాన ఇంధనం లేదా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలు రికార్డు స్థాయికి చేరడమే ఈ రవాణా ఛార్జీల బాదుడుకు ప్రధాన కారణమని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

జులై నుంచి సెప్టెంబర్ 30తో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో (క్యూ2) ఇండిగో మాతృసంస్థ 'ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్' రూ. 1,879.1 కోట్ల ...