భారతదేశం, జూలై 8 -- India vs England: వరుసగా రెండు సార్లు ప్రపంచ టీ20 ఛాంపియన్ టీమిండియా. జట్టులో ప్రపంచ స్థాయి టీ20 ఆటగాళ్లు. అపోనెంట్ ఏదైనా తుక్కురేగ్గొడుతూ వరుస విజయాలు సాధించిన టీమ్ అది. కానీ ఇప్పుడు ఒక్క విక్టరీ కోసం ఎదురు చూస్తోంది. ఇంగ్లాండ్ తో మూడో టీ20లో దారుణ పరాభవాన్ని ఖాతాలో వేసుకుంది. అసలు టీమిండియాకు ఏమైంది?

మంగళవారం (జూలై 7) రాత్రి ఇంగ్లాండ్ తో జరిగిన మూడో టీ20లో టీమిండియా అత్యంత అవమానకరమైన రీతిలో ఓటమి పాలైంది. టీ20 చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద పరాజయాన్ని ఖాతాలో వేసుకుంది. భారత జట్టు ఏకంగా 125 రన్స్ తేడాతో ఓడిపోయింది.

ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 201 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (44 బంతుల్లో 70), సామ్ కరణ్ (24 బంతుల్లో 41 నాటౌట్) చెలరేగారు. భారీ ఛేజింగ్ లో భారత్ బొక్కబోర్లా పడింది. కనీసం...