భారతదేశం, జూన్ 15 -- Ind W vs Pak W: టీ20 ప్రపంచకప్ 2026లో ఇండియన్ విమెన్ టీమ్ కు అదిరిపోయే స్టార్ట్ దక్కింది. టోర్నీలో తమ ఫస్ట్ మ్యాచ్ లోనే భారత అమ్మాయిలు చెలరేగారు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను చిత్తు చేశారు. హై వోల్టేజ్ యాక్షన్ పోరును వన్ సైడ్ చేసేశారు. ఆదివారం (జూన్ 14) రాత్రి జరిగిన మ్యాచ్ లో 64 రన్స్ తో గెలిచారు.

ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఉండే హైప్ వేరే లెవల్. ఈ మెగా పోరులో మరోసారి ఇండియాదే డామినెన్స్. టీ20 ప్రపంచకప్ 2026 గ్రూప్-1 లో భాగంగా జరిగిన మ్యాచ్ లో పాక్ పై భారత్ గెలిచింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 170 రన్స్ చేసింది. ఛేజింగ్ లో పాక్ ను 106 రన్స్ కే కుప్పకూల్చింది భారత్.

టీ20 ప్రపంచకప్ లో పాకిస్థాన్ పై సాధించిన ఈ విక్టరీ ఇండియాకు చాలా ముఖ్యమైంది. కేవలం పాక్ ను చిత్తు చేశామనే కాదు.. ...