భారతదేశం, మార్చి 1 -- టీ20 ప్రపంచకప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియాకు చావో రేవో. ఈ పొట్టి కప్ టోర్నీలో సెమీస్ చేరాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్ లో టీమిండియా ఈ రోజు (మార్చి 1) వెస్టిండీస్ తో తలపడుతోంది. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఈ మ్యాచ్ జరుగుతోంది.

సొంతగడ్డపై ఇండియాకు సవాల్. డేంజరస్ వెస్టిండీస్ టీమ్ తో భారత్ నేడు తలపడుతోంది. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే టీమిండియా టీ20 ప్రపంచకప్ సెమీస్ చేరుతుంది. ఓడిపోతే మాత్రం ఇంటిముఖం పట్టాల్సిందే. ఈ నేపథ్యంలో డూ ఆర్ డై పోరులో ఇండియా ఎలా ఆడుతుందోనని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. సొంతగడ్డపై ఇండియాకు తిరుగులేదు. కానీ భారీ హిట్టర్లతో నిండిన విండీస్ ను తక్కువ అంచనా వేయలేం.

టీమిండియా విధ్వంసక ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ లోకి రావడం జట్టుకు ఎంతో రిలీఫ్ ఇచ్చే విషయం. జింబాబ్వేతో మ్యాచ్ లో అతను చెలరేగిపోయాడు. ...