భారతదేశం, అక్టోబర్ 3 -- అనుకున్నదే జరిగింది! భారత్​ చేతిలో పాకిస్థాన్ జట్టు మరోసారి ఓడిపోయింది. జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 పురుషుల క్రికెట్ ఫైనల్స్​లో గెలిచిన శ్రేయస్ అయ్యర్ సేన.. భారత్​కు స్వర్ణ పతకాన్ని అందించింది. కొన్ని రోజుల క్రితం జరిగిన మహిళల క్రికెట్​ ఫైనల్స్​లో శ్రీలంకపై గెలిచి మన భారత ఉమెన్స్ టీమ్ గోల్డ్​ మెడల్​ సాధించిన విషయం తెలిసిందే.

నిషిన్​లో జరిగిన ఆసియా గేమ్స్ 2026 పురుషుల క్రికెట్​ ఫైనల్స్​లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 6 వికెట్లు కోల్పోయి 211 పరుగులు భారీ లక్ష్యాన్ని పాక్ ముంగిట ఉంచింది. బదులుగా ఫర్హాన్ సేన మాత్రమే 192 రన్సే చేయగలిగింది.

భారత్​- పాక్ మ్యాచ్ మధ్య పోరు కోసం క్రికెట్​ అభిమానులు ఒకప్పుడు చాలా ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురుచూసే వారు. ఇటీవలి కాలంలో మాత్రం వార్ వన్ సైడ్ అయిపోయింది! పాకిస్థాన్​ ...