భారతదేశం, ఫిబ్రవరి 25 -- క్రికెట్ లవర్స్ గెట్ రెడీ.. టీ20 ప్రపంచకప్ లో మరోసారి ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. ఈ చిరకాల ప్రత్యర్థుల పోరుకు రంగం సిద్ధమవుతోంది. కేవలం భారత్, పాక్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రికెట్ లవర్స్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూసే మ్యాచ్ మళ్లీ రాబోతుంది.

ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ అంటే కలిగే హైప్ మామూలు కాదు. ఈ పోరుకు ఉండే క్రేజ్ వేరు. రీసెంట్ గా పురుషుల టీ20 ప్రపంచకప్ లో ఇండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో పాక్ ను ఇండియా చిత్తుచిత్తుగా ఓడించింది. దాయాది దేశంపై ఈ విజయంతో భారత్ లో సంబరాలు మిన్నంటాయి.

ఇప్పుడు మరోసారి టీ20 ప్రపంచకప్ లో ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ కు రంగం సిద్ధమవుతోంది. 2026లోనే జరిగే వుమెన్ టీ20 ప్రపంచకప్ లో ఈ చిరకాల ప్రత్యర్థులు తలపడనున్నాయి. ఈ మె...