భారతదేశం, మార్చి 5 -- టీమిండియాను ఒంటిచేత్తో టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ చేర్చిన సంజూ శాంసన్ తన ఫామ్ కొనసాగిస్తూ ఇంగ్లండ్ బౌలర్లను కూడా చితకబాదాడు. అతడు కేవలం 42 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్స్ లతో 89 రన్స్ చేయడంతో ఇండియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 253 రన్స్ చేసింది.
టీ20 వరల్డ్ కప్ రెండో సెమీఫైనల్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే అది ఎంత తప్పుడు నిర్ణయమో సంజూ శాంసన్ త్వరలోనే చూపించాడు. ఆ టీమ్ బౌలర్లను ఊచకోత కోస్తూ తన చివరి సూపర్ 8 మ్యాచ్ ఫామ్ ను కొనసాగించాడు.
అభిషేక్ శర్మ (9) మరోసారి నిరాశ పరిచినా.. ఇషాన్ కిషన్ (18 బంతుల్లో 39)తో కలిసి రెండో వికెట్ కు 97 రన్స్ జోడించి టీమిండియా కళ్లు చెదిరే స్టార్ట్ ఇచ్చాడు సంజూ శాంసన్. ఈ క్రమంలో వరుసగా రెండో హాఫ్ సెంచరీ చేశాడు. గత మ్యాచ్ లో 97 రన్స్ దగ్గర ఆగి తృటిలో సెంచరీ మిస్సయిన అతడు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.