భారతదేశం, మార్చి 5 -- టీ20 ప్రపంచకప్ లో మరో థ్రిల్లర్ కు రంగం సిద్ధమైంది. పొట్టి కప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ తో ఇండియా తలపడుతోంది. నేడు ఈ డూ ఆర్ డై మ్యాచ్. గురువారం వాంఖడే స్టేడియంలో జరిగే సెమీస్ బలమైన ఇంగ్లిష్ జట్టును భారత్ ఢీకొడుతోంది. హెడ్ టు హెడ్ రికార్డు, మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ వివరాలను ఇక్కడ చూసేయండి.

ఇండియా, ఇంగ్లాండ్ టీమ్ మధ్య మరో రసవత్తర పోరు జరగబోతుంది. ఇవాళ (మార్చి 5) ఈ రెండు బలమైన జట్ల మధ్య టీ20 ప్రపంచకప్ ఫైట్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే టీ20ల్లో ఇంగ్లాండ్ పై ఇండియాదే పైచేయి కావడం మన ఫ్యాన్స్ కు సంతోషాన్ని ఇచ్చేదే.

టీ20ల్లో టీమిండియా, ఇంగ్లాండ్ హెడ్ టు హెడ్ రికార్డుపై ఓ లుక్కేద్దాం. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకూ జరిగిన టీ20ల్లో ఇండియా 17 గెలిచింది. ఇంగ్లాండ్ ఏమో 12 నెగ్గింది. గత ఆరు టీ20ల్లో ఏమో ఇ...