భారతదేశం, జూన్ 6 -- Imtiaz Ali Comments On Nepo Kids Vs Outsiders: సినిమా రంగంలో వారసత్వం (నెపోటిజం) అనే పదం వినబడితే చాలు సోషల్ మీడియాలో ట్రోల్స్, విమర్శలు వెల్లువెత్తుతాయి. స్టార్ కిడ్స్ కేవలం తమ కుటుంబ నేపథ్యం వల్లే సులభంగా అవకాశాలు దక్కించుకుంటున్నారని, ప్రతిభ గల అవుట్‌సైడర్ల (బయటి వ్యక్తులు) కెరీర్‌ను దెబ్బతీస్తున్నారనే ఆరోపణలు తరచూ వినిపిస్తుంటాయి.

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా నిరంతరం సాగే ఈ సుదీర్ఘ వివాదంపై టాలెంటెడ్ డైరెక్టర్ ఇంతియాజ్ అలీ పూర్తిగా భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పరిశ్రమలో వారసుల కంటే బయటి నుంచి వచ్చే వారికే తమను తాము నిరూపించుకోవడం కొంత సులువని ఆయన విశ్లేషించారు.

ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఇంతియాజ్ అలీ వారసత్వ సమీకరణాలపై మనసు విప్పి మాట్లాడారు. బాలీవుడ్ టాప్ స్టార్స్ రణ్‌బీర్ కపూర్, అలియా భట్‌లను 'నెపో క...