భారతదేశం, ఆగస్టు 22 -- భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి రాబోయే రోజుల వాతావరణ సూచనలు, హెచ్చరికల బులేటిన్‌ను విడుదల చేసింది. రాష్ట్రంలో రాబోయే కొన్ని రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

23వ తేదీన ఉదయం 08:30 నుండి 24వ తేదీ ఉదయం 08:30 వరకు రాష్ట్రంలోని కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడవచ్చు. కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదు కావచ్చు.

ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి...