భారతదేశం, జూలై 22 -- రుతుపవనాల ప్రభావం తెలంగాణ వ్యాప్తంగా మళ్లీ పుంజుకుంది. రుతుపవన ద్రోణి తీవ్రరూపం దాల్చడంతో రాష్ట్రవ్యాప్తంగా బుధ, గురువారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన విస్తారమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

ఈ రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుందని, వాతావరణం చల్లబడనుందని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో బుధవారం ఉదయం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కొన్ని ప్రాంతాల్లో ఉదయం నుంచి తుంపర్లుగా వానపడుతూనే ఉంది. సాయంత్రానికి చల్లని గాలులతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.

ఒక్కసారిగా వర్షం పడటంతో రోడ్లపైకి నీరు చేరి వాహనదారులు, ఆఫీసుల నుంచి ...