భారతదేశం, ఏప్రిల్ 19 -- హైదరాబాద్‌లో నేటి(ఏప్రిల్ 19) నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏప్రిల్ 22వ తేదీ వరకు ఇలాగే పరిస్థితులు ఉండనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే నాలుగు రోజుల పాటు భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డీ) ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో వేసవి తాపం తీవ్రంగా ఉంది.

సాయంత్రం హైదరాబాద్, తెలంగాణలోని ఇతర జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. అయితే అనేక జిల్లాల్లో మధ్యాహ్నం వరకు ఉష్ణోగ్రతలు అధికంగానే ఉండే అవకాశం ఉంది.

తెలంగాణ వెదర్‌మ్యాన్ కూడా వెదర్ అప్డేట్ ఇచ్చారు. మధ్యాహ్నం వరకు రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌కు చేరవచ్చని అంచనా వేశారు. హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు 41-42 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండే అవకాశం ఉంది.

అయితే, సాయంత్రం న...