IMD rain alert : కేరళ నుంచి కశ్మీర్ వరకు.. రుతుపవనాల రుద్రరూపం! 5 రాష్ట్రాలు అతలాకుతలం
భారతదేశం, జూలై 9 -- జూన్ నెలలో అసలు కనిపించకుండా పోయిన నైరుతి రుతుపవనాలు ఈ నెలలో మాత్రం కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి! గడిచిన 24 గంటల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన రికార్డు స్థాయి వర్షాలు పలు రాష్ట్రాలను ముంచెత్తాయి. అకస్మాత్తుగా దూసుకొచ్చిన వరదలు, కొండచరియలు విరిగిపడటం, ఇళ్లు కూలిపోవడం వంటి ఘటనలతో దేశంలో జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది. రవాణా వ్యవస్థ ఛిన్నాభిన్నం కావడంతో వేలాది మంది ప్రయాణికులు రైల్వే స్టేషన్లలో, జాతీయ రహదారులపై చిక్కుకుపోయారు.
పరిస్థితి తీవ్రతను గమనించిన కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రులతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. బాధితుల సహాయార్థం కేంద్ర బలగాలను, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించామని, రాష్ట్రాలకు అవసరమైన అన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.