IMD Rain Alert : ఏపీకి తీవ్రవాయుగుండం ముప్పు - భారీ వర్షాలు కురిసే అవకాశం!
భారతదేశం, సెప్టెంబర్ 19 -- Andhrapradesh Weather Updates : ఆంధ్రప్రదేశ్ కు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో మళ్లీ ఉపరితల ఆవర్తనం తీవ్రరూపం దాల్చుతోంది. ఉత్తర అండమాన్ పరిసర ప్రాంతాలలో శనివారం సాయంత్రానికి ఒక అల్పపీడనం ఏర్పడనుందని.. ఇది సోమవారానికి వాయుగుండంగా బలపడుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
ఈ అల్పపీడన వ్యవస్థ క్రమంగా తీవ్రమై మంగళవారం నాటికి తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇది బుధవారం ఉదయానికి దక్షిణ ఒడిశా - ఉత్తరాంధ్ర తీరాల సమీపానికి చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఫలితంగా రాష్ట్రంలోని వాతావరణంలో వేగంగా మార్పులు చోటుచేసుకునే సూచనలున్నాయి.
ఈ తీవ్రవాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర సహా కోస్తాంధ్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.