భారతదేశం, నవంబర్ 8 -- దేశవ్యాప్త పరిస్థితులపై తాజా వాతావరణ సూచనలు జారీ చేసింది భారత వాతావరణ శాఖ (ఐఎండీ). అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, రానున్న వెస్టర్న్ డిస్టర్బెన్స్ ప్రభావంతో వాతావరణం అనూహ్యంగా మారుతోంది. ఓ వైపు దక్షిణ రాష్ట్రాలను కుండపోత వర్షాలు వణికిస్తుండగా, మరోవైపు ఉత్తరాదిన హిమాలయ ప్రాంతాల్లో మంచు దట్టంగా కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.

ఆగ్నేయ అరేబియా సముద్రం, దక్షిణ కేరళ తీరానికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో దక్షిణ ద్వీపకల్పంలో తీవ్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో నవంబర్ 10 వరకు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు.

కేరళ, మాహే ప్రాంతాల్లో నవంబర్ 8న కుండపోత వానలు పడతాయని వాతావరణ శాఖ తాజా బు...