IMD : జమ్ముకశ్మీర్ నుంచి అండమాన్ వరకు.. దేశవ్యాప్తంగా ఇక భారీ వర్షాలు
భారతదేశం, సెప్టెంబర్ 17 -- దేశవ్యాప్తంగా వాతావరణ సరళి మళ్లీ మారుతోంది. రానున్న కొన్ని రోజుల పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. అండమాన్ నికోబార్ దీవులు, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో వర్షపాతం తీవ్రత మరీ ఎక్కువగా ఉండనుందని అధికారులు స్పష్టం చేశారు.
దక్షిణ భారతదేశంలోనూ రాబోయే రోజుల్లో వానల తీవ్రత పెరగనుంది. తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 19 నుంచి 22వ తేదీ మధ్య పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో రానున్న రోజుల్లో వర్షాలు మరింత ఊపందుకునే అవకాశం ఉండటంతో చేతికొచ్చిన పంటలను కాపాడుకునేందుకు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.
...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.