భారతదేశం, సెప్టెంబర్ 6 -- Im Game 3 Days Worldwide Box Office Collection: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సరికొత్త క్రైమ్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ 'ఐయామ్ గేమ్' బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనతో ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. గురువారం (సెప్టెంబర్ 3) భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, వారాంతంలో ఊపందుకుంటుందని భావించినప్పటికీ మూడో రోజు వసూళ్లు కాస్త తగ్గడం ట్రేడ్ వర్గాలను కలవరపెడుతోంది.

శనివారం (సెప్టెంబర్ 5) కూడా వసూళ్లలో పతనం నమోదు కావడంతో, బాక్సాఫీస్ వద్ద ఐయామ్ గేమ్ చిత్రం నిలదొక్కుకోవడానికి ఆదివారం (సెప్టెంబర్ 6) కలెక్షన్స్ చాలా కీలకంగా మారాయి.

తెలుగులో 'మహానటి', 'సీతా రామం', 'లక్కీ భాస్కర్' వంటి వరుస విజయాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యారు దుల్కర్ సల్మాన్. అయితే మలయాళంలో మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆయన నుంచి వచ్చ...