భారతదేశం, నవంబర్ 8 -- Illu Illalu Pillalu Serial: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ బుల్లితెరపై అదిరే రేటింగ్ తో దూసుకుపోతోంది. ఈ స్టార్ మా సీరియల్ కు తెలుగు జనాలు జై కొడుతున్నారు. రామరాజు కుటుంబం చుట్టూ సాగుతున్న కథ మన ఆడియన్స్ కు బాగానే కనెక్ట్ అవుతోంది. అందుకే ఈ సీరియల్ కు జనాల నుంచి క్రేజ్ దక్కుతోంది.

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో రామరాజు కుటుంబాన్ని సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. కాస్త హ్యాపీగా ఉంటారో లేదో మరో ప్రమాదం ముంచుకొస్తోంది. తాజాగా వల్లికి విడాకులు ఇస్తానని చందు భీష్మించుకోవడం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ నేపథ్యంలో సీరియల్ లో చందుకు రెండో పెళ్లి జరుగుతుందా? అనే ప్రశ్న ఆడియన్స్ లో కలుగుతోంది.

సీరియల్ లో చందుకు రెండో పెళ్లి చేస్తారనే అనుమానాలు రావడం వెనుక మరో కారణం కూడా ఉంది. అదే చందు మాజీ లవర్ అంజలి రీ ఎంట్రీ. బతుకమ్మ సంబరాల్లో ...