భారతదేశం, అక్టోబర్ 25 -- Illu Illalu Pillalu Serial: స్టార్ మాలో ప్రసారమవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ వారానికో కొత్త స్టోరీ లైన్ తో, అదిరిపోయే ట్విస్ట్ లతో సాగిపోతోంది. ఇప్పుడేమో సీరియల్ లో రామరాజు కుటుంబానికి పెద్ద సమస్య వచ్చింది. అర్జెంట్ గా రూ.50 లక్షలు అవసరం వచ్చింది. మరి ఈ డబ్బు ఎలా సర్దుబాటు అవుతుందనేది ఉత్కంఠ రేపుతోంది.

ట్రావెల్స్ ఆఫీస్ వేలం పాటలో ప్రేమ పంతానికి పోయిన సంగతి తెలిసిందే. తన అత్త భద్రావతి ముందు భర్త ధీరజ్ ఓడిపోవద్దని ఎక్కువ రేట్ అయినా సరేనని రూ.30 లక్షలకు వేలం పాట పాడింది. ఇప్పుడా డబ్బు ఎలా అరెంజ్ చేయాలా? అని ధీరజ్ తల పట్టుకుంటున్నాడు.

మరోవైపు నగలు పెట్టి డబ్బులు తీసుకున్న సాగర్ కు కూడా షాక్ తగిలింది. ఆ సేట్ మరోసారి ఇంటికి వచ్చాడు. వడ్డీ కట్టడం కాదు అసలు కట్టాలంటూ అరిచాడు. దీంతో సాగర్ పొగరుగా మాట్లాడాడు. నాలు...