భారతదేశం, అక్టోబర్ 11 -- Illu Illalu Pillalu Serial Latest Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు తాజా ఎపిసోడ్‌లో శ్రీవల్లి ఆడుతున్న నాటకాలు పూర్తిగా బయటపడటంతో రామరాజు కుటుంబం సహనం నశించింది. "నీ గురించి తెలిసి కూడా మా కొంపను కూల్చుకోలేం. బయటకు నడు" అని వేదవతి గట్టిగా అరుస్తుంది.

నర్మద, ప్రేమ, ధీరజ్, సాగర్‌లను క్షమించమని, మావయ్యకు నచ్చజెప్పమని బతిమిలాడుకుంటుంది శ్రీవల్లి. శ్రీవల్లి నర్మద, ప్రేమల కాళ్లావేళ్లా పడి క్షమించమని ప్రాధేయపడినా ఎవరూ కనికరించరు. అలాగే నాటకాలు ఆడుతుందని భావించిన వేదవతి, కామాక్షి, నర్మద, ప్రేమలకు సహనం నశించి వల్లిని, భాగ్యం కుటుంబాన్ని బయటకు గెంటేస్తారు.

ఇదే గొడవలో రామరాజు కుటుంబం నాశనమైపోతుందని భాగ్యం శాపనార్థాలు పెడుతుంది. దాంతో "నా కుటుంబం జోలికి వస్తే ఊరుకోను" అని నర్మద చెంపదెబ్బ కొట్టి మరి భాగ్యానికి స్ట్రాంగ్ వార్నిం...