భారతదేశం, అక్టోబర్ 17 -- Illu Illalu Pillalu Serial: తెలుగు ఆడియన్స్ విపరీతంగా ఆదరిస్తున్న సీరియల్ లో ఇల్లు ఇల్లాలు పిల్లలు ముందంజలో ఉంది. స్టార్ మాలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ కు తెలుగు నాట ప్రేక్షకులు ఎక్కువే. ఫ్యామిలీ ఎమోషన్స్, ట్విస్ట్ లు, ఉత్కంఠతో ఈ సీరియల్ దూసుకెళ్తోంది. ఆడియన్స్ కు మంచి థ్రిల్ అందిస్తోంది.

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో రామరాజు నడిపి కోడలు నర్మద గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తన కుటుంబానికి ఏ ఆపద వచ్చినా తన తెలివితో ఆమె కాపాడుకుంటూ వస్తోంది. బల్లక్కాయ్ కుట్రల నుంచి భద్రావతి కుతంత్రాల వరకూ రామరాజు కుటుంబానికి నర్మద శ్రీ రామరక్షగా ఉంటుంది. ఎప్పటికప్పుడూ తన ఫ్యామిలీని సంతోషంగా ఉండేలా చూసుకుంది.

ఈ సీరియల్ లో రామరాజు పెద్ద కోడలు శ్రీవల్లి తన అత్తామామలు, భర్తకు దిమ్మతిరిగే షాకిచ్చింది. తన కుట్రలు బట్టబయలు కావడంతో బ...