భారతదేశం, నవంబర్ 28 -- Illu Illalu Pillalu Serial: తెలుగు రాష్ట్రాల్లో మంచి రేటింగ్ తో దూసుకెళ్తున్న సీరియల్స్ లో 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' ఒకటి. ఈ సీరియల్ లో రామరాజు ముగ్గురు కొడుకులు చందు, సాగర్, ధీరజ్ కథలు ఇంట్రెస్టింగ్ గా సాగుతున్నాయి. ఈ సీరియల్ లో అన్నదమ్ములుగా నటిస్తున్న ఈ ముగ్గురు బయట కూడా అదే రిలేషన్ షిప్ మెయింటైన్ చేస్తున్నారు.

పాపులర్ సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలులో రామరాజు పెద్ద కొడుకు చందుగా ప్రశాంత్, నడిపోడు సాగర్ గా రఫీక్ షా, చిన్నోడు ధీరజ్ గా నితిన్ నటిస్తున్నారు. తాజాగా పెద్దోడు ప్రశాంత్ పెళ్లి జరిగింది. ఈ నవంబర్ 25న పెద్దోడి వివాహం గ్రాండ్ గా జరిగింది. కానీ షూటింగ్ కారణాల వల్ల సీరియల్ టీమ్ పెళ్లికి వెళ్లలేకపోయింది.

తాజాగా ప్రశాంత్ రిసెప్షన్ కు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టీమ్ నుంచి రఫీక్ షా, నితిన్, అన్షు రెడ్డి (నర్మద)...