భారతదేశం, సెప్టెంబర్ 21 -- Illu Illalu Pillalu September 21 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. ప్రేమను మాటలతో మాయ చేయాలని భద్రావతి ప్రయత్నిస్తుంది. మన కుటుంబం పరువు ధీరజ్ తీశాడని ప్రేమను రెచ్చగొట్టాలని చూస్తుంది. ధీరజ్ ఆవేశపరుడు కావొచ్చు. కానీ రామరాజు మామయ్య నాటకాలు ఆడరు అత్తయ్య అని ప్రేమ చెప్తుంది.

నాలుగు గోడల మధ్య జరిగిన మా పెళ్లి చెల్లదని అన్నారు కాబట్టి మామయ్య మా పెళ్లి చేస్తానన్నారు. నేను, ధీరజ్ కలిసి ఉండాలని ఆ నిర్ణయం తీసుకున్నారు. అది డ్రామా కాదత్తా అని ప్రేమ చెప్పేసరికి భద్రావతి, సేనాపతికి ఫ్యూజలు ఔట్ అవుతాయి. కానీ సేనాపతి ఏమో ఎమోషనల్ డ్రామా ప్లే చేస్తాడు.

ఆ రామరాజు మంచివాడే అయితే భార్య, మామను కొడతావా? అని ధీరజ్ తో మనకు క్షమాపణ చెప్పించేవాడు. అలా చేయకుండా డైరెక్ట్ గా స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చారంటే ...