భారతదేశం, సెప్టెంబర్ 12 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో టైర్లో గాలి తీసి రెడీగా ఉండమని ధీరజ్ చెబితే తాము వచ్చే కారు టైర్లో గాలి తీస్తుంది ప్రేమ. అది చూసిన ధీరజ్ కోప్పడుతాడు. నువ్వే సరిగా చెప్పలేదని ప్రేమ అంటే.. నువ్వు నోటితోనే బతికేస్తావే అని ధీరజ్ అంటాడు.

మరోవైపు ఉంగరం తొడగమని తిరుపతితో పంతులు అంటాడు. చేసేది లేక తిరుపతి రింగ్ తొడగబోతుండగా.. ధీరజ్ వచ్చి పాము పాము అని అరుస్తాడు. దాంతో అంతా కంగారుపడి అటు ఇటు తిరుగుతారు. లగెత్తు మామ అని ధీరజ్ అంటాడు. ఇద్దరు పరుగెత్తుతారు. అల్లుడు గుడి మెట్లు దాటకూడదు అని చింతామణి రౌడీలను పంపిస్తుంది.

తిరుపతి, ధీరజ్ పరుగెడుతారు. కారులో తిరుపతిని ధీరజ్ తీసుకెళ్తాడు. తమ టైర్లో గాలి తీశారని తెలుస్తుంది. రేయ్ ధీరజ్‌గా ఎంత దూరం వెళ్తావో వెళ్లురా అని భద్రావతి కో...