భారతదేశం, అక్టోబర్ 9 -- Illu Illalu Pillalu October 9 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. శ్రీవల్లి పన్నిన కుట్రలు, చేసిన దారుణాలు తెలిసే సరికి రామరాజు ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. వల్లి దగ్గరకు వస్తుంటే రామరాజు వద్దంటాడు. ఆ రోజు అమూల్య విషయలో ఈయనకు గుండెపోటు రావడానికి కారణం నువ్వే, ఇప్పుడు ఏమైనా అయితే బతకనివ్వను అని వేదవతి ఫైర్ అవుతుంది.

వల్లి అమ్మానాన్నను పిలిపించండని రామరాజు చెప్తాడు. వల్లి చెప్పే మాటలను రామరాజు అసలు వినడు. నమ్మి ఎంతో మోసపోయానని రామరాజు కోప్పడతాడు. వల్లి అమ్మానాన్నకు సుక్కును ఫోన్ చేయమని ప్రేమ చెప్తుంది. ఇక్కడ జరిగింది ఏదీ చెప్పొద్దని అంటుంది. సుక్కు ఫోన్ చేస్తుంది.

రేయ్ పెద్దోడా, ఇన్ని రోజులు మనసులో ఇంత బాధను మోశావా? నీ తమ్ముళ్లతో పంచుకోవాలని అనిపించలేదా? అని చందును సాగర్ అడుగుతాడు. నా జీవితం చ...