భారతదేశం, అక్టోబర్ 30 -- Illu Illalu Pillalu October 30 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. బతుకమ్మను ఎత్తుకొని అంత దూరం నడవలేవ్ కానీ కార్లో తీసుకెళ్తానని ప్రేమతో ధీరజ్ చెప్తాడు. నాయనా ధీరజ్.. భార్య మీద ప్రేమ ఉండొచ్చు కానీ నడిస్తే కందిపోతుందేమో అన్నంత మాత్రం ఉండకూడదు. మేం మనుషులం కాదా? మేం నడవట్లేదా? అని నర్మద సెటైర్ వేస్తుంది.

అసలే ఆమె శత్రుదేశపు యువరాణి కదా వదిన. భూమి మీద నడవడం ఆమె బాదం కాయ్ భద్రావతి అత్త, నాన్న బిజ్జాలదేవ చూశారనుకో మా తింగరి యువరాణిని వాకింగ్ చేయిస్తావా అని కత్తి తీసుకొని యుద్ధానికి వస్తారని ప్రేమను ధీరజ్ ఎగతాళి చేస్తాడు. అమ్మను కార్లో తీసుకెళ్తానని అనకుండా, భార్యను తీసుకెళ్తానని అంటే మీరు ఫీల్ అవుతారు కదా. అందుకే మా వాళ్లని అని కవర్ చేశాడని వేదవతి ముందు ధీరజ్ ను ప్రేమ ఇరికిస్తుంది.

దీంతో వేదవత...