భారతదేశం, అక్టోబర్ 26 -- Illu Illalu Pillalu October 26 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. రూ.30 లక్షల డబ్బుతో, మూడు మూరెల మల్లెపూలతో వస్తాడు నా రాజు అంటూ ప్రేమ గదిలో గంతులేస్తుంది. అప్పుడే వచ్చిన ధీరజ్ ప్రేమను చూసి షాక్ అవుతాడు. ఏంటి నాధా వచ్చావా? అని ప్రేమ అడుగుతుంది.

ప్రేమకు ధీరజ్ బ్యాగ్ ఇస్తాడు. డబ్బు తీసుకురావడం వరకే నీ పని అని ప్రేమ అంటుంది. ధీరజ్ చెప్పేందుకు ట్రై చేసినా ప్రేమ వినదు. రేపు ఉదయమే ఈ బ్యాగ్ పట్టుకొని వెళ్లి మా భద్రావతి అత్తను బయటకు పిలిచి రప్ఫాడిస్తా అని ప్రేమ తెగ బిల్డప్ ఇస్తుంది.

నీ డైలాగ్ అయిపోయేసరికి అందులో ఉన్న ఐస్ క్రీమ్ కరిగిపోతుంది తినమని ప్రేమకు ధీరజ్ చెప్తాడు. ఐస్ క్రీమ్ హా, థ్యాంక్స్ రా మరి రూ.30 లక్షలు ఏవీ అని ప్రేమ అడుగుతుంది. ఊరంతా తిరిగినా రూ.30 వేలు కూడా అప్పు పుట్టలేదని ధీరజ్ చ...