భారతదేశం, అక్టోబర్ 23 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో వేలం పాటలో రూ. 30 లక్షల ఒక్క రూపాయికి ధీరజ్ సొంతం చేసుకున్నట్లు ప్రకటిస్తారు. అంతా చప్పట్లు కొడతారు. ధీరజ్ మనం గెలిచామురా అని ప్రేమ గొప్పలు పోతుంది. నా భర్తను ఎవరిముందు ఓడిపోనివ్వను. గెలిపించాను అని భద్రావతితో అంటుంది ప్రేమ.

నేను ఓడిపోవడం కాదే కావాలనే ఇరికించాను. రూ. 12 లక్షలు కూడా విలువ చేయనిదాన్ని 30 లక్షలు కట్టేలా చేశాను. వీడి మొహానికి ఎక్కడి నుంచి కడతాడు 30 లక్షలు. అంటే 18 లక్షలు నష్టం. నేనే గెలిచినట్లుగా అని భద్రావతి అంటుంది. సర్ క్యాష్ ఎలా ఇస్తారు అని వేలం పాట వాళ్లు అడుగుతారు. కట్టేందుకు టైమ్ ఉంటుంది కదా అని ప్రేమ అంటుంది.

ఉంటుంది కానీ చూసుకోవాలి. ఆలోపు కట్టకపోతే ఐదు లక్షలు పెనాల్టీ పడుతుందని వాళ్లు చెబుతారు. ధీరజ్, ప్రేమ వెళ...