భారతదేశం, అక్టోబర్ 2 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో ధీరజ్‌తో దూరంగా ఉండటం ఎంత నరకంగా ఉందో చెబుతుంది ప్రేమ. తిరిగి నా సామ్రాజ్యంలోకి అడుగుపెట్టాను. మళ్లీ నా ఊపిరి తిరిగొచ్చినట్లుందని ప్రేమ సంతోషంగా అంటుంది. ప్రేమను వెనుక నుంచి ధీరజ్ హగ్ చేసుకుంటాడు. ఈసారి కొత్త ప్రయాణమే అని ప్రేమ అంటుంది.

ఎప్పుడు ఎలా ఉంటావో తెలియదు. మళ్లీ మీ పుట్టింటికి తుర్రుమనొచ్చు అని ధీరజ్ అంటాడు. నేను నిన్ను దెయ్యంలా పట్టుకుని వేలాడుతాను. ఇప్పుడు బంధం మరింత గట్టిపడిందని ధీరజ్‌ గుండెలపై వాలిపోతుంది ప్రేమ. ధీరజ్ పాదాలపై తన కాళ్లు పెట్టి అటు ఇటు నడుస్తుంది ప్రేమ. మరోవైపు శ్రీవల్లి కుట్రల గురించి ఆలోచిస్తుంది నర్మద.

నీ బండారం బయటపెట్టే టైమ్ వచ్చేసిందని నర్మద అనుకుంటుంది. ఇంకోవైపు శ్రీవల్లి కూడా వణికిపోతుంటుంది. ఇంతలో ...