భారతదేశం, నవంబర్ 9 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో వేదవతికి నర్మద కాఫీ ఇస్తుంది. ధీరజ్ ఫైనాన్స్ విషయంలో చింతామణి, భద్రావతి ట్రాప్ చేశారట, విశ్వ చెప్పారని కంగారుగా చెబుతుంది వేదవతి. మావయ్య వెళ్లారంటే చక్కదిద్దుకుని వస్తారని నర్మద చెబుతుంది. వేదవతి కాఫీ తాగుతుంటే బీపీ ట్యాబ్లెట్ వేసుకోమంటుంది.

నేను చెప్పేదానికి బీపీ రావచ్చు అని ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తుంది నర్మద. విషయం చెప్పమని వేదవతి అడుగుతుంది. మన వల్లిని మళ్లీ ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది అని మాట ఇచ్చానని నర్మద చెబుతుంది. దాంతో తిరుపతి షాకై కిందపడతాడు. సుకన్య సంతోషిస్తుంది. నువ్వు ఎవరో మాట ఇవ్వడానికి. ఇది నా ఇల్లు. నాకు నచ్చినవాళ్లే ఇంట్లో ఉంటారు. నచ్చనివాళ్లు బయట ఉంటారని వేదవతి కోప్పడుతుంది.

ఏంటీ మీ ఇల్లా. ఓహో.. అక్కడిదాకా వచ్...